కాఫీ,టీ,కూల్ డ్రింక్ లతో మందులను వేసుకుంటే ఏమి అవుతుందో తెలుసా?
do you take medicines with coffee or cool drinks : మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళితే మందులను ఇస్తారు. మనలో చాలా మంది మందులను మంచి నీటితో వేసుకుంటారు. అయితే కొంత మంది కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఇతర పానీయాలతో పాటు మందులు వేసుకుంటారు. అలా వేసుకోవటం మంచిది కాదని నిపుణులు చెప్పుతున్నారు.
శీతల పానీయాలు లేదా కూల్ డ్రింక్స్ తో మందులను వేసుకుంటే…వాటిలో ఉండే ఆమ్లాలు ,కార్బోనేటేడ్ లు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఔషధాల ప్రభావాలను తగ్గిస్తాయి. ముఖ్యంగా కొన్ని కార్బోనేటేడ్ డ్రింక్స్ మీరు తీసుకునే మెడిసిన్ పిల్స్ పై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అందువల్ల మాత్రలతో పాటు శీతల పానీయాలు తీసుకోవడం మానేయాలి.
మందులు తీసుకున్న తర్వాత కూడా శీతల పానీయాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి శరీరం ఐరన్ గ్రహించకుండా అడ్డుకుంటాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఐరన్ సప్లిమెంట్లను తీసుకుంటే మాత్రం కూల్ డ్రింక్స్ తో మందులు వేసుకోకూడదు…అలాగే మాత్ర వేసుకున్న అరగంట వరకు కూల్ డ్రింక్ తాగకుండా ఉంటేనే మంచిది.
ఒకవేళ కూల్ డ్రింక్స్ తో మందులను వేసుకుంటే మందుల ప్రభావాలను తగ్గించి వ్యాధిని నయం చేసే అవకాశంను తగ్గిస్తుంది. అలాగే జ్యూస్ ల విషయానికి వస్తే ద్రాక్ష పండు రసాన్ని మందులతో పాటు లేదా ముందు తాగవద్దు. ఇది మందులపై చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కాఫీ మరియు టీ విషయానికి వస్తే, వీటిలో టానిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
దీని కారణంగా, శరీరంలో కాల్షియం లేదా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. కాబట్టి పాలతో మాత్రమే మందులు తీసుకోవచ్చు. కాఫీ మరియు టీతో కాదు. మంచి నీటితో మందులను వేసుకుంటే ఎటువంటి ప్రభావాలు ఉండవు. కాబట్టి మందులను వేసుకొనేటప్పుడు కాఫీ,టీ,కూల్ డ్రింక్స్ వంటివి కాకుండా నీటితో వేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.