Healthhealth tips in telugu

బిర్యానీలో దాల్చిన చెక్క వస్తే పాడేస్తున్నారా…ఈ విషయం తెలిస్తే అసలు వదలకుండా తింటారు

cinnamon Health Benefits In telugu : మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క అంటే ఇష్టం ఉండని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. చిన్న దాల్చిన చెక్క పేడు నోట్లో వేసుకుని నమిలితే విభిన్నమైన ఫ్లేవర్‌తో అద్బుతమైన టేస్ట్‌ శరీరం మొత్తానికి తెలుస్తుంది.ఆ తర్వాత కొన్ని నిమిషాలకు కాసిన్ని మంచినీరు తాగితే అబ్బో ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం.
Dalchina chekka for weight loss
కేవలం రుచిలోనే కాకుండా ఔషద గుణాల్లో కూడా అద్బుతమైన గొప్పదనం కలిగి ఉన్న దాల్చిన చెక్కను వాడితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. దాల్చిన చెక్కలో మన శరీరానకి సహాయ పడే 41 సమ్మేళనాలు ఉంటాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.
Weight Loss tips in telugu
బరువు తగ్గాలని అనుకునేవారు దాల్చిన చెక్కను వాడితే కొవ్వు నిల్వ ప్రక్రియలో పాల్గొనే అణువులను తగ్గించడం ద్వారా కొవ్వును తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, అర స్పూన్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్క టీ త్రాగటం వలన కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క చాలా మేలును కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది.
Diabetes diet in telugu
ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. అందుకే దాల్చిన చెక్క మధుమేహం పేషంట్స్ కు చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కను తగిన మోతాదులో వాడి ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. దాల్చిన చెక్క చాలా విరివిగానే లభ్యం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.