Healthhealth tips in telugu

షుగర్ ఉన్నవారికి సంజీవిని… అర స్పూన్ పొడి అన్నంలో కలిపి తింటే చాలు

Diabetes Home Remedies In telugu :మెంతులను మన వంటింట్లో రెగ్యులర్ గా వంటల్లో వాడుతూ ఉంటాం. కాస్త చేదుగా ఉంటాయి. కాబట్టి తక్కువ మోతాదులో వాడుతూ ఉంటాం. మెంతులు వంటలకు మంచి రుచిని అందిస్తాయి. మెంతులు డయాబెటిస్ చికిత్సలో చాలా బాగా సహాయపడుతాయి.
fenugreek seeds
మెంతులను ఎక్కువగా ఆయుర్వేద వైద్య నిపుణులు సిఫార్సు చేస్తూ ఉంటారు. డయాబెటిస్ అంటే మధుమేహం ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులను వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.
Diabetes diet in telugu
మెంతులను కూడా ప్రతి రోజు పావు స్పూను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదా పావు స్పూను పొడి అన్నంలో కలుపుకుని తినవచ్చు. మెంతులను వేగించి పొడి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. మెంతులలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియను కార్బోహైడ్రేట్స్ మరియు చక్కెరలను శరీరం నిదానంగా గ్రహించేలా చేస్తుంది.
fenugreek seeds Benefits in telugu
ఈ మధ్యకాలంలో మెంతుల గురించి చాలా పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో డయాబెటిస్ ని నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయని తేలింది. ప్రతిరోజు మెంతులను తీసుకుంటూ ఉంటే టాబ్లెట్ మోతాదు పెంచవలసిన అవసరం ఉండదు. డాక్టర్ సూచించిన మందులను వాడుతూ మెంతులను కూడా తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది.

మెంతులను ప్రతి రోజు తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.