దగ్గు, జ్వరం,గొంతు,ఛాతీలో కఫంని 1 రోజులో నాశనం చేసి ఇమ్మ్యూనిటి ని రెట్టింపు చేస్తుంది
Immunity Drink in Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన శరీరంలో రోగనిరోదక శక్తి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కోసం మందులు వాడకుండా మనకు ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవచ్చు. కొంతమందిలో రోగనిరోదక శక్తి తక్కువగా ఉంటుంది.
వారిలో వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు శరీరంలో వ్యాధినిరోదక వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ డ్రింక్ ప్రతి రోజు తాగాలి. ఈ డ్రింక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో తిప్పతీగ కాడలు చిన్నవి 5,ఒక తిప్పతీగ ఆకు వేయాలి.
ఆ తర్వాత 10 తులసి ఆకులు,4 మిరియాలు,చిటికెడు పసుపు,చిన్న అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. బాగా మరిగాక వడకట్టి దానిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు తాగితే సరిపోతుంది. ఇలా తాగుతూ ఉంటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ మధ్య కాలంలో తిప్పతీగ వాడకం కూడా చాలా పెరిగింది. తిప్పతీగ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తులసి,మిరియాలు, పసుపు,అల్లంలో ఉన్న లక్షణాలు కూడా సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
కాస్త ఓపికగా ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. సమస్య తీవ్రం అయితే మాత్రం డాక్టర్ సూచన ప్రకారం మందులు వాడుతూ ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.