Healthhealth tips in telugu

జీలకర్ర, ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు…

jeera with apple cider vinegar Benefits in telugu : జీలకర్ర, ఆపిల్ సైడర్ వెనిగర్ ఈ రెండింటిలోనూ ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా అధిక బరువు సమస్య ఉన్నవారికి బాగా సహాయపడుతుంది.
jeelakarra Health Benefits in telugu
రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా అలా వదిలేయాలి. మరసటి రోజు ఉదయం ఈ నీటిని వడగట్టి అర స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి. ఇలా తాగటం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. శరీరంలో వ్యర్ధాలు అన్ని మూత్రం ద్వారా బయటకు పోతాయి. కిడ్నీలు శుభ్రపడతాయి.

జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. వీటిలో ఉండే పాలీఫెనాల్స్ మరియు గ్యాలిక్ యాసిడ్, క్వెర్సెటిన్ మరియు కెంప్ఫెరోల్ వంటి సమ్మేళనాలు ఫ్రీ-రాడికల్ స్కావెంజింగ్ ఏజెంట్‌లుగా పనిచేసి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి బరువు తగ్గటంలో సహాయపడతాయి.

శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జీలకర్ర జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లపై ఉద్దీపన ప్రభావాన్ని చూపి కడుపు ఉబ్బరం,గ్యాస్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. జీలకర్రలో ఫైటోస్టెరాల్స్ మరియు సపోనిన్‌లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉండుట వలన కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తాయి.
Weight Loss tips in telugu
కాలేయ ఎంజైమ్‌లపై పని చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ను పిత్త ఆమ్లాలుగా మార్చడాన్ని కూడా ప్రేరేపిస్తాయి. దాంతో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు జీలకర్ర,ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి తీసుకొని మంచి ప్రయోజనాన్ని పొందండి. ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా సులభంగానే దొరుకుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.