వెల్లుల్లితో ఇలా చేస్తే చాలు ఆస్తమాకు చెక్ పెట్టవచ్చు….ముఖ్యంగా ఈ సీజన్ లో…
Garlic asthma Home Remedies in Telugu : ఆస్తమా ఒక్కసారి వచ్చిందంటే తగ్గటం చాలా కష్టం. చలికాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో ఊపిరి సరిగా ఆడక చాలా ఇబ్బంది పడిపోతు ఉంటారు. ఆస్తమా రావటానికి అనేక కారణాలు ఉన్నప్పటికి దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కామన్ గా ఉండే లక్షణాలు.
ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మందులు వేసుకుంటున్నా ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. ఇది ప్రాణాంతకం కాక పోయినా,తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ వ్యాధి పూర్తిగా తగ్గదు. ఉపశమనం కోసం మాత్రమే మందులు ఉంటాయి.
ఆస్తమా నియంత్రణలో ఉంచటానికి ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఆస్తమా కోసం మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే ఈ సీజన్ లో ప్రశాంతంగా ఉండవచ్చు. వెల్లుల్లిని ఆహారంలో బాగంగా చేసుకుంటే ఆస్తమా నుంచి తగిన ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
వెల్లుల్లి ఆస్తమా నివారణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి ఆస్తమాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. వెల్లుల్లిలో టమోటా కంటే రెండు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఫ్రీ రాడికల్స్, అస్థిర అణువులను తటస్తం చేయడంలో సహాయపడుతుంది.
దాంతో ఆస్తమా ఉన్నవారిలో వాయుమార్గ మృదువైన కండరాల సంకోచానికి కారణమవుతుంది. 3 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి వేలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి ముక్కలను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఉడికిన వెల్లుల్లితో సహ ఈ పాలను ప్రతి రోజు తీసుకుంటే ఆస్తమా నుండి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.