Healthhealth tips in telugu

పెసలను ఎక్కువగా తీసుకుంటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Who Should Not Eat Moong Dal : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మన శరీరానికి ప్రోటీన్ వంటి పోషకాలు అందాలంటే పెసలను తీసుకోవాలి. మనలో చాలా మంది పెసలను మొలకలుగా చేసుకొని తింటూ ఉంటారు. పెసలలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి కొన్ని సమస్యలు ఉన్నవారు పెసలకు దూరంగా ఉండాలి.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు పెసలను తింటే రక్తపోటు తగ్గి నియంత్రణలోకి వస్తుంది. అందువల్ల తక్కువ తక్తపోటు సమస్యతో బాధపడేవారు పెసలను ఎక్కువగా తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకుంటే మంచిది. రక్తపోటు తక్కువ ఉన్నవారు తింటే రక్తపోటు మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.
Acidity home remedies
జీర్ణ సంబంద సమస్యలు అయినా గ్యాస్,కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు పెసలను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే పెసలలో ఉండే ఒకరకమైన కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియలో సమస్యలు రావటానికి కారణం అవుతాయి. అందువల్ల వారంలో రెండు సార్లు తగిన మోతాదులో తీసుకుంటే సరిపోతుంది.
Diabetes In Telugu
పెసలు డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అయితే Low Blood Sugar తో బాధపడేవారు పెసలను చాలా లిమిట్ గా తీసుకోవాలి. ఎందుకంటే పెసలను ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి పెసలను తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
uric acid
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కీళ్ల నొప్పులు వస్తాయి. అందువల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ఆహారానికి దూరంగా ఉండాలి. తక్కువ రక్తపోటు, Low Blood Sugar, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు, జీర్ణ సమస్య ఉన్నవారు పెసలను లిమిట్ గా తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.