Healthhealth tips in telugu

పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

piles Home Remedies In telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు,నీరు తక్కువగా తాగటం,మలబద్దకం సమస్య,ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది.
piles home remedies
ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఎండుద్రాక్ష పైల్స్ సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన మలం గట్టిపడకుండా నిరోధిస్తుంది మరియు మృదువుగా చేస్తుంది.

ఎండుద్రాక్ష భేదిమందు లక్షణాలను కలిగి ఉండుట వలన మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. కడుపుపై ​​శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉండుట వలన అసిడిటీని నియంత్రించడంలో సహాయపడుతుంది. 5 ఎండుద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన ఎండుద్రాక్షను నీటితో సహ తీసుకోవాలి. అలా కాకుండా పాలల్లో ఉడికించి కూడా తీసుకోవచ్చు.

5 ఎండుద్రాక్షలను నెయ్యిలో వేయించి, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి రాత్రి పడుకొనే ముందు తినాలి. ఎండుద్రాక్షను ఇప్పుడు చెప్పిన ఏ పద్దతిలో తీసుకున్న మంచి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి పైల్స్ సమస్య నుండి బయట పడండి.

అలా చేస్తూ ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించాలి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.