Healthhealth tips in telugu

ఊదా క్యాబేజీని ఎప్పుడైనా తిన్నారా…ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు

purple cabbage Benefits in telugu : క్యాబేజీలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఊదా క్యాబేజీ కూడా విరివిగానే లభిస్తుంది.ఊదా క్యాబేజీలో విటమిన్లు A, C మరియు K, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం మరియు పొటాషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
Purple Cabbage
ఊదా క్యాబేజీని వారంలో రెండు సార్లు తింటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ఈ క్యాబేజీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణక్రియ ప్రక్రియలో ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఉడికించిన క్యాబేజీని తినడం వల్ల అజీర్ణం,గ్యాస్,కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.
Acidity home remedies
కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గే అవకాశం ఉంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు తింటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడటమే కాకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

ఊదా క్యాబేజీలో విటమిన్ సి orange కన్నా ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని విషాలను బయటకు పంపుతాయి. అలాగే కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి.
Brain Foods
కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ కె, పొటాషియం,కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు మరియు కండరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యాబేజీలో ఉండే ఆంథోసైనిన్లు అల్జీమర్స్ వ్యాధిని నిరోధించడంలో సహాయపడతాయి. మరియు ఫలకం ఏర్పడకుండా నిరోధించడం ద్వారా మెదడును కాపాడి జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.