ఈ మ్యాజికల్ టీ తాగితే ఒత్తిడి,డిప్రెష‌న్‌, ఆందోళ‌న,తలనొప్పి అన్నీ పోయి ప్రశాంతంగా ఉంటారు

stress Reduced tea In Telugu : బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడి డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో చాలా ఎక్కువగానే బాధపడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనం ఇంటి చిట్కా ద్వారా ప్ర,శాంతత పొందవచ్చు. కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే టీ తయారు చేసుకొని తాగితే మంచి ఉపశమనం కనబడుతుంది.

ఒత్తిడి,డిప్రెషన్ కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం ఒక పొడిని తయారు చేసుకోవాలి. మిక్సీ జార్ లో మూడు లవంగాలు, అర స్పూను సోంపు, పావు స్పూను దాల్చిన చెక్క పొడి, రెండు మిరియాలు, రెండు యాలకులు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. .
sompu
ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నెపెట్టి ఒక గ్లాసు నీటిని పోసి తయారు చేసి పెట్టుకున్న పొడిని అర స్పూన్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి ఉదయం సమయంలో తీసుకోవాలి…లేదంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నప్పుడు తీసుకుంటే వెంటనే ప్రశాంతత కలుగుతుంది. .

అలాగే తలనొప్పి ఉన్నప్పుడు కూడా ఈ టీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ టీలో రుచి కోసం తేనె కలుపుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తేనె లేకుండా తీసుకోవాలి. ఈ టీ తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సీజనల్ గా వచ్చే వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది.

దగ్గు,జలుబు,గొంతు నొప్పి ఉన్నప్పుడూ ఈ టీని అరగ్లాసు మోతాదులో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి టీ తయారుచేసుకొని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.