రాత్రి పడుకునే ముందు పాదాలకు నూనెతో మసాజ్ చేస్తే ఏమి అవుతుందో తెలుసా?

Feet Massage Benefits in Telugu : ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు రెండు నిమిషాల పాటు పాదాలను నూనెతో మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో పాదాలు ఒకటి. రోజంతా నడవటం, చెప్పులు,బూట్లు వేసుకోవటం వలన కొన్ని సార్లు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి పాదాలు వాపుకు గురి అవుతాయి.
Feet Care Tips
అధిక బరువు ఉన్నప్పుడు,గర్భధారణ సమయంలో బరువు పాదాలపై పడటం వల్ల నొప్పి,వాపు వంటివి వస్తాయి. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు నూనె రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయడం చాలా మంచిది. అలాగే ఇలా మసాజ్ చేయటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Powerful Pain Killer oil
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి తుడిచి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవనూనెను గోరువెచ్చగా చేసి రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. పగిలిన మడమలు మృదువుగా మారతాయి. రోజంతా పాదాలపై కలిగే ఒత్తిడి, బిగుతుగా ఉండే బూట్లు వేసుకోవడం వల్ల నరాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే ఒక్కోసారి నరాలు తెగిపోయేలా నొప్పి ఉంటుంది.
Oil massage
నూనెతో మర్దన చేస్తే బిగుతుగా ఉన్న నరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో రక్తప్రసరణ సులభతరం అవుతుంది. అలాగే పాదాల నొప్పులు కూడా తగ్గుతాయి. పాదాలకు నూనె రాసుకోవడం వల్ల ఒత్తిడి మరియు అలసట తొలగిపోయి శరీరం మొత్తం రిలాక్స్‌గా ఉంటుంది. పాదాల నరాల్లో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నప్పుడూ వచ్చే పాదాల నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

పాదాలను నూనెతో మసాజ్ చేయడం వల్ల పాదం మరియు కాలు కండరాలు రిలాక్స్ అవుతాయి. పాదాలకు నూనె రాసి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి నిద్ర బాగా పడుతుంది. అలాగే ఉదయం లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు నూనెతో మసాజ్ చేసి నిద్రపోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.