1 గ్లాసు శరీరంలో కొవ్వు కరగటమే కాకుండా ఊహించని ప్రయోజనాలు…అసలు మిస్ కావద్దు

Tulasi weight Loss Tips in Telugu : ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు,ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం,వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం,ఒత్తిడి వంటి కారణాలతో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగటం అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది.
Tulasi Health benefits in telugu
అదే తగ్గాలంటే చాలా కష్టం. దాంతో మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ప్రొడక్ట్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా కాస్త శ్రద్ద పెట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. ఈ రెమిడీ లో మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

పది నుంచి 12 తులసి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత అర స్పూన్ వాము, నాలుగు మిరియాలు వేసి మెత్తని పేస్ట్ గా చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి దానిలో పైన తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో విషాలు అన్ని బయటకు పోతాయి. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ సీజన్లో మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి దగ్గు., జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. కాస్త ఒత్తిడిగా ఉన్నప్పుడూ తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులు,మిరియాలు,వాము ఈ మూడు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ రెమిడీని ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.