Healthhealth tips in telugu

నోటిలో 1 స్పూన్ నూనెను పోసుకొని పుక్కిలిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…?

Oil Pulling benefits In telugu : నోటిలో నూనెను పోసుకొని పుక్కిలించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెప్పుతుంది. మన రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్ లేదా నోటిలో నూనెను పోసుకొని పుక్కిలించడం అనేది శరీరంలోని అన్ని భాగాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఆయిల్ పుల్లింగ్ అంటే నోటిలో నూనె పోసుకొని పుక్కిలించడం. దీని కోసం నువ్వుల నూనె, ఆవాల నూనె లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. పళ్ళు తోమకుండా ఉదయాన్నే ఇలా చేస్తే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఒక స్పూన్ నూనెను నోటిలో పోసుకొని 5 నిమిషాల పాటు పుక్కిలిస్తే సరిపోతుంది.

ఈ విధంగా చేయటం వలన నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాలు, చిగుళ్లు, నాలుకను శుభ్రంగా ఉంచుకోవచ్చు. అలాగే నోటి పుండ్లు, పళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మనం నవ్వినప్పుడు మన బుగ్గలకు వ్యాయామం వచ్చినట్లే, ఆయిల్ పుల్లింగ్ చేసినప్పుడు చెంప ప్రాంతానికి మంచి వ్యాయామం జరిగి చెంప ప్రాంతానికి రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మెరుస్తుంది.
eye sight remedies
కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి నరాలకు మంచి వ్యాయామం అందుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీని వల్ల దృష్టి సమస్యలు రావు. అలాగే రోజంతా కంప్యూటర్, మొబైల్ చూస్తూ అలసిపోయిన కళ్లకు ఓదార్పునిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది.నోటి దుర్వాసన తొలగిపోతుంది.
Powerful Pain Killer oil
ఆయిల్ పుల్లింగ్ ని ప్రతి రోజు నెల రోజుల పాటు చేయాలి. ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల ప్రారంభించాలి. ఆయిల్ పుల్లింగ్ అనేది ఉదయం పళ్ళు తోముకున్న తర్వాత లేదా పళ్ళు తోమకుండా కూడా చేయవచ్చు. ఖర్చు లేని ఈ ప్రక్రియను చేసి ఈ ప్రయోజనాలను పొందండి. కాబట్టి మీరు ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.