1 గ్లాస్ 15 రోజులు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా నీరసం,అలసట ఉండవు

weight Loss Protein Powder in telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. .

అలాంటప్పుడు ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి మూడు స్పూన్ల ఓట్స్, ఒక స్పూన్ గుమ్మడి గింజలు, ఒక స్పూన్ అవిసే గింజలు, నాలుగు బాదం పప్పులు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించి… కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేయాలి.
oats benefits
ఆ తర్వాత అర స్పూన్ కోకో పౌడర్, మూడు గింజలు తీసిన ఖర్జూరాలు, ఒక గ్లాసు సోయా పాలు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ డ్రింక్ ని ఉదయం సమయంలో తీసుకుంటే తినాలనే కోరిక తగ్గి ఆకలి వేయదు. అలాగే జీవక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
gummadi ginjalu benefits in telugu
దాంతో బరువు తగ్గుతారు. అలాగే నీరసం., అలసట,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఈ డ్రింక్ తీసుకోవడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ డ్రింక్ ని వారంలో రెండు లేదా మూడు. సార్లు తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. .
Health Benefits of Dates
ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దాంతో సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా ఏమి రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.