Healthhealth tips in telugu

పెయిన్ కిల్లర్ టాబ్లెట్ బదులు దీన్ని వాడండి…కీళ్ల నొప్పులు తగ్గి మజిల్స్ రిలాక్స్ అవుతాయి

Joint pains Home remedies In Telugu :మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల గురించి మనలో చాలా మందికి తెలియక పిచ్చి మొక్కలుగా భావిస్తూ వుంటాం. అయితే ఆ మొక్కలలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉంటాయి. అటువంటి మొక్కలలో వావిలాకు ఒకటి.

ఈ వావిలాకు గురించి మన పెద్ద వారికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత స్నానాలకు ఈ ఆకులను ఉపయోగించేవారు ఈ ఆకులను నీటిలో వేసి ఆ సారంతో స్నానం చేస్తే శరీరంలో నొప్పులు తగ్గుతాయని మన పెద్దవారు వావిలాకు ను ఉపయోగించేవారు.
Joint pains in telugu
వావిలాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్ళవాపు, కీళ్ల నొప్పులు తగ్గటానికి ఈ వావిలి ఆకులు చాలా బాగా సహాయపడుతాయి దీనికోసం ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని కాస్త వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పులు అలాగే వాపు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

వావిలాకు పొడి మార్కెట్లో లభ్యం అవుతుంది. ఆయుర్వేద షాపుల్లో అలాగే ఆన్లైన్ స్టోర్ లో కూడా .దొరుకుతుంది. అర స్పూన్ పొడిని 2 కప్పుల నీటిలో కలిపి సగం నీరు అయ్యేవరకు ఉడికించి వడగట్టి తాగితే దగ్గు,గొంతు చికాకు,జ్వరం వంటివి తగ్గిపోతాయి. నువ్వుల నూనె వావిలాకు రసం కలిపి పొయ్యి మీద పెట్టి .నీరు అంతా ఇగిరిపోయేదాకా మరిగించాలి.
Joint Pains
ఈ నూనెను నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కండరాల నొప్పులు మరియు అన్నీ రకాల నొప్పులు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి వావిలాకును ఉపయోగించి ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.