దగ్గు,జలుబు,గొంతునొప్పి ఉన్నవారు ఉల్లిపాయ తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Onion For Cold Home Remedies In telugu : మనం ప్రతి రోజు ఉల్లిపాయను వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ వంటలకు మంచి రుచిని అందిస్తుంది. అలాగే ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జలుబు,దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. ఉల్లిపాయలో యాంటీ అలర్జిక్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉండుట వలన వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

జలుబు,దగ్గు తగ్గటానికి ఉల్లిపాయ ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని రోజులో రెండు సార్లు తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ రసంలో కేవలం తేనెను మాత్రమే కలిపి తీసుకున్న మంచి ప్రయోజనం కనపడుతుంది.

జలుబు మరియు ఫ్లూ నయం చేయడానికి ఉల్లిపాయ ఆవిరిని పట్టవచ్చు. జలుబు ఉన్నప్పుడు ముక్కు బ్లాక్ అవుతుంది. అలాగే ఛాతీలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ కఫం దగ్గు సమస్యను ప్రారంభిస్తుంది. కేవలం నీటిని మరిగించి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆవిరి పట్టాలి.
How to cut onions without crying In Telugu
భోజనానికి ముందు ఉల్లిపాయను బెల్లంతో కలిపి తీసుకుంటే ముక్కు రద్దీ మరియు కఫం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది. మనలో చాలా మంది పచ్చి ఉల్లిపాయను కూడా తింటూ ఉంటారు.
Onion benefits in telugu
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.