Healthhealth tips in telugu

బెండకాయను ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Bendakaya Health benefits In telugu :Okra అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. బెండకాయ కాస్త జిగురుగా ఉంటుందని చాలా మంది పెద్దగా తినరు. అయితే బెండకాయలో ఉన్న పోషకాల సంగతి తెలిస్తే మాత్రం తినటానికి ప్రయత్నం చేస్తారు. బెండకాయని ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు లేడిస్ ఫింగర్,భిండీ మరియు బెండకాయ అనే పేర్లతో పిలుస్తారు.
Bendakaya Benefits In telugu
బెండకాయలో A,B,C,E మరియు K విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి. అంతేకాక బెండకాయలో ముసిలగినౌస్ ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది. బెండకాయను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధ సమస్యలు మరియు మలబద్దకం తొలగిపోయి బౌల్ మూవ్ మెంట్ బాగుంటుంది.
Diabetes In Telugu
బెండకాయ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందనే విషయం చాలా మందికి తెలియదు. రెగ్యులర్ డైట్ లో బెండకాయను తీసుకోవటం వలన మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. బెండకాయలో విటమిన్ K సమృద్ధిగా ఉండుట వలన రక్తం గడ్డకట్టకుండా మరియు ఎముకలను బలంగా తయారుచేయడంలో బెండకాయ చాలా బాగా సహాయపడుతుంది.

విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడాంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మం మీద ముడతలు,మొటిమలు తగ్గించటానికి సహాయపడుతుంది. అంతేకాక ఫ్రీ రాడికల్స్ ద్వారా దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయటంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో బెండకాయ గచాలా బాగా సహాయపడుతుంది . దాంతో గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు.

కొంత మంది చుండ్రును నివారించడానికి బెండకాయ పేస్ట్ ను తలకు అప్లై చేస్తూ ఉంటారు. బెండకాయలను నీళ్ళలో వేసి ఉడికించి తర్వాత మెత్తని పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. బెండకాయలో ఉన్న వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ని తరిమి కొట్టటానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

అంతేకాక విటమిన్ సి కూడా సాధారణ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. విటమిన్ సి ఎక్కువ తెల్ల రక్త కణాలను సృష్టించడానికి మరియు రోగనిరోధక వ్యవస్థ ఉద్దీపన చేయటానికి సహాయపడుతుంది. కాబట్టి వారంలో రెండు సార్లు బెండకాయ తినటానికి ప్రయత్నం చేయండి. బెండకాయ సంవత్సరం పొడవునా విరివిగానే లభిస్తాయి.
kidney problems
హెచ్చరిక
బెండకాయలో అక్సలేట్స్ అధిక స్థాయిలో ఉంటుంది. అక్సలేట్స్ వలన మూత్రపిండంలో రాళ్ళూ ఉన్నవారికి రాళ్లు పెరగటానికి కారణం కావచ్చు. అలాగే వేయించిన బెండకాయను ప్రతి రోజు తీసుకొంటే మీ కొలెస్ట్రాల్ ప్రమాదకరమైన స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి వేరే పద్ధతుల్లో బెండకాయను తీసుకోని ఈ ప్రయోజనాలు పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.