Healthhealth tips in telugu

పరగడుపున అల్లం,నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో…అసలు నమ్మలేరు

Ginger lemon water for weight loss In Telugu : అల్లం,నిమ్మకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి ఉదయం సమయంలో పరగడుపున తీసుకుంటే ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రోజు అల్లంను వంటింటిలో వాడుతూ ఉంటాం. అల్లం,నిమ్మరసం కలిపి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. డయాబెటిస్ ఉన్న వారు తేనె లేకుండా తీసుకుంటే మంచిది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి అజీర్ణం, వికారం మరియు గుండెల్లో మంట వంటి వాటిని తగ్గిస్తుంది.
Ginger benefits in telugu
అల్లంలో జింక్ సమృద్దిగా ఉండుట వలన ఇన్సులిన్ విడుదలలో కీలకమైన పాత్రను పోషించి డయాబెటిస్ నియంత్రణలో ఉంచటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్లం,నిమ్మరసం రెండూ కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి సహాయపడతాయి.
Weight Loss tips in telugu
అధిక బరువు ఉన్నవారికి చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. తినాలనే కోరికను తగ్గించటమే కాకుండా శరీరం యొక్క కొవ్వు శోషక సామర్థ్యాన్ని పెంచుతుంది. దాంతో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ లు సమృద్దిగా ఉండుట వలన రక్తాన్ని శుద్ది చేస్తుంది.
Brain Foods
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది. మెదడు కణాల క్షీణతను తగ్గించడంలో సహాయపడి అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు రాకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఒక గ్లాసు తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.