Healthhealth tips in telugu

పిస్తా పప్పులు ఎక్కువగా తింటున్నారా… అయితే ప్రమాదంలో పడినట్టే

pistachios in telugu :మనలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని ఇష్టంగా తింటుంటారు. అలా తినే డ్రైఫ్రూట్స్ లో పిస్తా పప్పు ఒకటి. పసుపు పచ్చ వర్ణంలో ఉండే పిస్తా పప్పు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు.
pistachios in telugu
పిస్తా పప్పు ధర కాస్త ఎక్కువగా ఉన్నా సరే పోషకాలు మాత్రం అధికంగా ఉంటాయి. పిస్తా పప్పులో విటమిన్ ఏ,విటమిన్ బి,విటమిన్ E, ఫాస్ఫరస్,ఐరన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,ప్రోటీన్,ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. పిస్తా పప్పును లిమిట్ గా తీసుకుంటే మెదడు షార్ప్ గా పనిచేస్తుంది.
kidney problems
అదే ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. పిస్తా పప్పును ఎక్కువగా తీసుకున్నప్పుడు కాల్షియం ఆక్సాలేట్ మ‌రియు సిస్టైన్ మూత్ర‌పిండాల్లో పేరుకు పోయి రాళ్లు ఏర్ప‌డేలా ప్రేరేపిస్తాయి. ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది . ముఖ్యంగా ద‌ద్దుర్లు, చ‌ర్మం దుర‌ద పెట్ట‌డం, తుమ్ముళ్లు వంటి సమస్యలు వస్తాయి.

అందువల్ల ఎలర్జీ ఉన్నవారు పిస్తాపప్పుకు దూరంగా ఉంటేనే మంచిది. బరువు పెరిగే అవకాశం,క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, అతిసారం వంటి స‌మ‌స్య‌లు వస్తాయి. లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఈ సమస్యలు తప్పవు. సాల్ట్ లేని పిస్తా పప్పు తీసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.