15 రోజులు 1 గ్లాసు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా నీరసం,అలసట ఉండవు

kalonji seeds Weight Loss Tips In telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ సన్నంగా అందంగా కనపడాలని కోరుకుంటారు. దాని. కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ కూడా వాడుతూ ఉంటారు. వాటి వలన పెద్దగా ప్రయోజనం కనపడక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. .

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగటం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి? ఏ సమయంలో తాగాలి….వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.
sompu beenfits
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడయ్యాక పావు స్పూన్ కలోంజి గింజలు., అర స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాసులోకి వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింకులో తేనె కూడా కలపొచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది. .
dhaniyalu
ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు ఈ డ్రింక్ తాగవచ్చు. ఉదయం సమయంలో కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగటానికి ఒక అరగంట ముందు కడుపు ఖాళీగా ఉంటే మంచిది. ఈ విధంగా నెల రోజులపాటు తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే అలసట,నీరసం అనేవి కూడా ఉండవు.
Weight Loss tips in telugu
కలోంజి గింజలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఇక ధనియాలు విషయానికొస్తే జీర్ణ. సంబంధ సమస్యలను తగ్గించి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వు పేరుకోకుండా శక్తిగా మారేలా చేస్తుంది. అలాగే సోంపు కూడా బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.