Healthhealth tips in telugu

ఈ నట్స్ తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు

pecan Nuts benefits In telugu : డ్రై ఫ్రూట్స్ లో అత్యంత ఖరీదైన పీకన్ నట్స్ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ నట్స్ ప్రతి రోజు తినటం వలన శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, లిపోప్రొటీన్ లేదా “చెడ్డ” కొలెస్ట్రాల్‌ ల స్థాయిలను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోదనలో తేలింది.
cholesterol reduce foods
ప్రస్తుతం మనలో చాలా మంది ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి ఈ డ్రై ఫ్రూట్ చాలా లాభం చేకూరుస్తుంది. ఈ నట్స్‌ లో ..పాలీ అన్‌ సాట్చూరేటెడ్‌ ఫ్యాట్‌తో పాటు బీటాసైటోస్టిరాల్‌ ఫ్యాట్‌ కాంబీనేషన్‌ ఉండటం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తుందని పరిశోదకులు అంటున్నారు.

యాంటి ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. ఎముకలు,కండరాలు బలంగా ఆరోగ్యంగా ఉండి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు లేకుండా చేస్తుంది. ఈ నట్స్‌లో ఎల్‌ ఆర్జిన్‌ అనే.. అమైనో ఆర్జిన్‌ ఉండటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు రాలకుండా పెరుగుతుంది.
Brain Foods
మెదడు పనితీరు బాగుంటుంది. అందువల్ల ఎదిగే పిల్లలకు కూడా మంచిది. డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బులు రాకుండా ee నట్స్ సహాయపడతాయని ఇటీవల జరిగిన పరిశోదనలో తేలింది. తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
Diabetes diet in telugu
ఈ నట్స్ లో మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, విటమిన్ ఇ మరియు జింక్, ఒమేగా -3 కొవ్వులు సమృద్దిగా ఉండుట వలన మంటను తగ్గించడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నట్స్ లో విటమిన్ ఎ, విటమిన్ ఇ మరియు జింక్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
pecan nuts
వీటిని డైరెక్ట్ గా తింటే కాస్త వెగటుగా ఉంటాయి. అందువల్ల నాలుగు గంటలు నానబెట్టి తినవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ కాస్త ఖరీదు ఎక్కువైన దానికి తగ్గట్టుగా మన శరీరానికి ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకి 3 pecan Nuts తినవచ్చు. స్ప్రౌట్స్‌తో, ఫ్రూట్స్‌తో కలిపి కూడా తినవచ్చు. ఈ నట్స్ ని తిని వీటిలో ఉన్న ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.