1 లడ్డు మెదడు చురుగ్గా పనిచేసి మతిమరుపు సమస్యలు లేకుండా…మరెన్నో ప్రయోజనాలు
Immunity booster Laddu In telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు…అలాగే రాకుండా ఉండాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. శరీరంలో బలహీనత, కీళ్ల నొప్పులు తగ్గించటానికి, మెదడు చురుగ్గా పనిచేయటానికి, మతిమరుపు సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే లడ్డు బాగా పనిచేస్తుంది.
ఈ లడ్డు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి 2 స్పూన్ల నువ్వులను వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి 2 స్పూన్ల బాదం పప్పు, ఒక స్పూన్ జీడిపప్పు, రెండు స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక కప్పు రాగి పిండి వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న నువ్వులు,బాదం పప్పు,జీడిపప్పు,వేరుశనగగుళ్లు, 4 యాలకులు, ఒక కప్పు బెల్లం వేసి మెత్తగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో వేయాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమంలో వేగించి పెట్టుకున్న రాగి పిండి వేసి….కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి లడ్డూలు తయారుచేసుకోవాలి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మతిమరుపు సమస్యలు ఏమి ఉండవు. అలాగే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది.
అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ లడ్డు తినటం వలన మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఈ లడ్డులను ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.