కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు,వెన్ను నొప్పి,వెరికోస్ వెయిన్స్ అన్నీ మాయం అవుతాయి
varicose veins and sore legs Home Remedies In telugu : ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ,వెన్ను నొప్పి వంటివి వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులు ప్రారంభంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే నూనె చాలా బాగా సహాయ పడుతుంది.
ఈ నూనె కాళ్లలో వెరికోస్ వెయిన్‌లకు కూడా బాగా పని చేస్తుంది. ఈ నూనె తయారుచేసుకోవటం చాలా సులభం. ఒక్కసారి ఈ నూనెను తయారుచేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు వాడవచ్చు. రెండు స్పూన్ల లవంగాలను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో లవంగాల పొడి, వెల్లుల్లి ముక్కలు వేయాలి.
ఆ తర్వాత 150 Ml ఆలివ్ నూనె వేయాలి. ఈ మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలిపి డబుల్ బాయిలింగ్ పద్దతిలో 15 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే సరిపోతుంది.
ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు సిరల గోడలను బలపరుస్తుంది. రక్తనాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది.
ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పి,వాపుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా చేసుకుంటే నొప్పుల నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ రెమిడీలో ఉపయోగించిన మూడు ఇంగ్రిడియన్స్ మనకు సులువుగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నూనెను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.