Kitchenvantalu

1 గ్లాసు రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి జీవితంలో రక్తహీనత సమస్య ఉండదు

Anemia Home Remedies In telugu : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నప్పుడు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. రక్తహీనత సమస్య తీవ్రతను బట్టి మందులు వాడుతూ…ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే చాలా తొందరగా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
Is Ragi Good for Diabetes
కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారు చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఒక బౌల్ లో రెండు స్పూన్ల రాగి పిండి, అరస్పూన్ కోకో పౌడర్ వేసి నీటిని పోస్తూ లూజ్ స్ట్రక్చర్ లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టాలి. అలాగే రెండు ఖర్జూరాలను గింజలు తీసేసి మెత్తని పేస్ట్ గా చేసి పక్కన పెట్టుకోవాలి.
Dates Health benefits
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి…నీరు కాస్త వేడి అయ్యాక రాగి మిశ్రమాన్ని వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఖర్జూరం పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఇక ఆ తర్వాత ఒక కప్పు హోం మేడ్ బాదంపాలని పోసి ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులో పోసుకొని తాగాలి.
coconut sugar benefits
ఈ డ్రింక్ ని ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ సమృద్ధిగా అందుతుంది. ఈ డ్రింకు తీసుకోవడం వల్ల అలసట., నీరసం, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉషారుగా పనులు చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. .

ఎముకలు పేలుసుగా మారకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. కాస్త ఓపికగా ఈ డ్రింక్ చేసుకొని తాగితే చాలా సులభంగా రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే సమస్యలు రావు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.