Healthhealth tips in telugu

ఈ పాలను తాగితే కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు పెరిగి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి

Joint Pains Home remedies in telugu : మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా అధిక బరువు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎముకల మధ్య జిగురు తగ్గిపోవటం, కీళ్ళు అరిగిపోవటం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. కీళ్ల నొప్పులు ఎక్కువ అయినప్పుడు ఎముకల నుండి శబ్దాలు.కూడా వస్తుంటాయి.
Joint Pains
అలాగే మోకాళ్ళ కీళ్ళు అరిగిపోవడం వల్ల ఎముకలు రాపిడికి గురై విపరీతంగా నొప్పి కలుగుతుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పే పాలు బాగా సహాయపడతాయి. ఇప్పుడు చెప్పే పాలను ప్రతిరోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా,దృఢంగా ఉంటాయి.

ఒక బౌల్ లో రాత్రి సమయంలో నాలుగు స్పూన్ల తెల్ల నువ్వులను వేసి నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నువ్వులను నీటితో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేసి…దాని నుంచి పాలను సపరేట్ చేయాలి. ఈ పాలల్లో రెండు స్పూన్ల ఖర్జూరం పేస్ట్ వేసి బాగా కలిపి ప్రతి రోజు తాగుతూ ఉండాలి. .
Health Benefits of Dates
ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే బలహీనంగా మారిన ఎముకలు బలంగా దృఢంగా మారి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలని తీసుకోవటం వలన జీర్ణ ప్రక్రియ కూడా బాగా సాగుతుంది. అలాగే అధిక బరువు సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి కూడా ఈ పాలు బాగా సహాయపడతాయి.

ఈ విధంగా 15 రోజులు తాగితే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గటమే కాకుండా కీళ్ల మధ్య జిగురు పెరిగి టక్ టక్ అనే సౌండ్ కూడా తగ్గుతుంది. నువ్వులు,ఖర్జూరం రెండూ కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు అసలు అశ్రద్ద చేయకుండా ఈ పాలను తాగి నొప్పుల నుండి ఉపశమనం పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.