Kitchenvantalu

నీటిలో కలిపి తాగితే 99% కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి జీవితంలో ఉండవు

Joint Pains Home Remedies In Telugu : కీళ్లనొప్పులు అనేవి ఒకప్పుడు అరవై ఏళ్ళు వచ్చాక వచ్చేవి. కానీ ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. దాంతో కంగారు పడిపోయి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అలా ఎక్కువగా మందులను వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
Sonthi Health benefits In Telugu
ఇంటి చిట్కా ఫాలో అయితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో అరస్పూన్ శొంఠి పొడి, అరస్పూన్ పసుపు, రెండు బిరియాని ఆకులను ముక్కలుగా కట్ చేసి 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించి, ఆ నీటిని వడకట్టి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి.
weight loss tips in telugu
ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. పది రోజుల పాటు తాగి ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల పది రోజుల పాటు తాగితే నొప్పులు తగ్గుతాయి. నొప్పులు ఎక్కువగా ఉంటే ప్రతి రోజు తాగవచ్చు. శొంఠి,పసుపు, బిరియాని ఆకులలో ఉన్న లక్షణాలు నొప్పి,వాపులను తగ్గించటంలో సహాయపడతాయి.
Biryani leaves health benefits In Telugu
శొంఠి పొడి మార్కెట్ లో దొరుకుతుంది. కానీ ఇంటిలో తయారుచేయటం మంచిది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే తొందరగా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
Joint Pains
ఈ డ్రింక్ తాగటం వలన నొప్పుల నుండి ఉపశమనం కలగటమే కాకుండా అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపుతుంది. సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గించి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఏ సమస్యలు లేని వారు వారంలో రెండు సార్లు తాగితే ఎన్నో సమస్యలు తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.