Healthhealth tips in telugu

పరగడుపున ఈ టీ తాగితే ఎసిడిటీ, మైగ్రేన్ తలనొప్పి, బీపీ, కొలెస్ట్రాల్ ఏమి ఉండవు

Herbal Tea Benefits In telugu : మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది ఎసిడిటీ, మైగ్రేన్, వికారం, తలనొప్పి, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, పొట్టలో కొవ్వు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని అశ్రద్ద చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే టీ బాగా సహాయపడుతుంది.
curry leaves benefits
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 15 కరివేపాకులు, 15 పుదీనా ఆకులు, ఒక స్పూన్ సొంపు, రెండు స్పూన్ల ధనియాలు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగవచ్చు.
sompu
ఈ టీ తాగటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. శరీరంలో వ్యర్ధాలు అన్నీ బయటకు పోతాయి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికీ కూడా బాగా పనిచేస్తుంది.
Health Benefits Of Eating Pudina
రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటం వలన రక్తప్రవాహం బాగా సాగి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. మైగ్రైన్ తలనొప్పి ఉన్నప్పుడూ ఈ టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యలను తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
dhaniyalu
శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి ఈ సీజన్ లో వచ్చే ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఇటువంటి టీ ని వారంలో మూడు సార్లు తాగితే చాలా మంచిది. కాబట్టి ఈ టీ ని మీరు ట్రై చేసి ఈ సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.