Healthhealth tips in telugu

ఇలా చేస్తే ఊపిరితిత్తులు కఫము, శ్లేష్మం లేకుండా క్లీన్ గా ఉంటాయి…ముఖ్యంగా ఈ సీజన్ లో…

Lungs clean in Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా అనేది ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ద తప్పనిసరిగా పెట్టాలి.
lungs
గాలిలో ఉండే విషపదార్థాలు., కాలుష్య కారకాలు, పొగ తాగే అలవాటు, కొన్ని అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా మారతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా, ఉండాలంటే ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు క్లీన్ గా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది.
Orange Health Benefits in telugu
ఆరెంజ్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
apple
అలాగే ఆపిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ బి, సి, ఇ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫము,శ్లేష్మం లేకుండా శుభ్రం అవుతాయి. ఉదయాన్నే కొన్ని పుదీనా ఆకులను తిన్నా ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.
Health Benefits Of Eating Pudina
వ్యాయామం, ప్రాణాయామం చేయటం వలన లంగ్స్ కెపాసిటీ బాగా పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలను తీసుకుంటే ఊపిరితిత్తులు క్లీన్ గా ఉంటాయి. ఈ సీజన్ లో తరచుగా ఇన్ ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మందుల జోలికి వెళ్లకుండా ఇలా చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.