Healthhealth tips in telugu

పాలల్లో ఉడికించి తింటే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అధిక బరువు అనేవి అసలు ఉండవు

Phool makhana with milk benefits In Telugu : మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలల్లో. పూల్‌ మఖానా ఉడికించి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఆర గ్లాసు పాలను పోసి 10 పూల్‌ మఖానా వేసి ఉడికించాలి.
Lotus Seeds benefits In Telugu
ఉడికిన తర్వాత అర స్పూన్ బెల్లం వేసి బెల్లం కరిగే వరకు అలా ఉంచాలి. ఆ తర్వాత ఈ పాలను ఉదయం సమయంలో తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల శారీరిక బలహీనత తగ్గుతుంది. అలసట., నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. పాలు మరియు మఖాన రెండింటిలోనూ ప్రోటీన్., ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. .
sleeping problems in telugu
ఈ మధ్యకాలంలో ఒత్తిడి కారణంగా మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఈ పాలను తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఈ పాలల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మంచి ఉపశమనం కలిగిస్తాయి.
Joint Pains
పాలు, మఖానా రెండింటిలోను కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు గుల్లగా, పేలుసుగా మారకుండా దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. వీటిలో మెగ్నీషియం, ప్రోటీన్, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే మెగ్నీషియం పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. ఎందుకంటే మఖానాలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తీసుకుంటే మంచిది.
gas troble home remedies
ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మఖాన పాలను కచ్చితంగా ప్రతిరోజు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మనకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.