ఉదయం తేనెలో యాలకుల పొడి కలిపి తీసుకుంటే…ముఖ్యంగా ఈ సీజన్ లో…
Cardamom And Honey Benefits In telugu : యాలకులు, తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రోజు ఒక స్పూన్ తేనెలో పావు స్పూన్ యాలకుల పొడిని కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాలకులలో అనేక రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేనెలో రోగనిరోధక శక్తిని పెంచే అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు, గొంతునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తేనె,యాలకుల్లో ఉండే పోషకాలు గుండెను దృఢంగా ఉంచడానికి మరియు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
తేనె,యాలకుల మిశ్రమాన్ని భోజనం అయ్యాక తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి గ్యాస్,కడుపు ఉబ్బరం,అజీర్ణం వంటి సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.
తేనె,యాలకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్ నివారించడంలో చాలా సహాయపడుతుంది. కాబట్టి తేనె,యాలకుల మిశ్రమాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.