పైల్స్ సమస్యతో బాధపడేవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి
piles problem : ఇటీవల కాలంలో మారిన మన జీవనశైలి అలవాట్ల కారణంగా అలాగే ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన లేకపోవడం, గంటల తరబడి అలా కూర్చోవడం ఇలా అనేక రకాల కారణాలతో ఫైల్స్ సమస్య అనేది వస్తుంది. కొన్ని ఆహారాలు తీసుకుంటే సమస్య కు చెక్ పెట్టవచ్చు. ఆ ఆహారాలు ఏమిటో చూద్దాం.
బాదం పప్పు పైల్స్ సమస్యను తగ్గించటానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు. బాదంలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పైల్స్ సమస్య తీవ్రతను తగ్గించటానికి సహాయపడతాయి. 5 బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున బాదం తొక్క తీసి తినాలి. శరీరంలో వ్యర్ధాలు అన్నీ బయటకు పోయి మలబద్దకం సమస్య తగ్గుతుంది
మలబద్దకం సమస్య కారణంగానే పైల్స్ సమస్య వస్తుంది. పైల్స్ సమస్య రావడానికి జీర్ణ సమస్యలు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఈ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినాలి. ఈ విధంగా బెల్లం తినడం వల్ల తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
మలబద్దకం సమస్య తగ్గి పైల్స్ సమస్య ఉండదు. పైల్స్ సమస్యకు నల్ల కిస్మిస్ చాలా బాగా సహాయపడుతుంది. నల్ల కిస్మిస్ లో ఉండే జింక్ క్యాల్షియం విటమిన్స్ ఎంతో మేలు చేస్తాయి. రాత్రిపూట ఐదు నుంచి ఏడు నల్ల కిస్మిస్ తింటే మలబద్దకం సమస్య తగ్గి పైల్స్ సమస్య కూడా తగ్గుతుంది.
పైన తెలిపిన ఆహార పదార్థాలు పైల్స్ సమస్యను తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. అయితే సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే ఈ ఆహారాలు బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రక్తస్రావం ఎక్కువగా అయ్యేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.