వెల్లుల్లిని ఇలా తీసుకుంటే దగ్గు, జలుబు వంటి ఎన్నో సమస్యలకు చెక్… ముఖ్యంగా ఈ సీజన్ లో…

Garlic Health Benefits In Winter : వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనం ప్రతి రోజు వంటల్లో వెల్లుల్లి వాడుతూ ఉంటాం. వెల్లుల్లి వంటలకు ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. అయితే మనలో చాలా మంది వెల్లుల్లి వాసన కారణంగా తినటానికి పెద్దగా ఇష్టపడరు.
garlic Health benefits
అయితే వెల్లుల్లిలో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ సీజన్లో వెల్లుల్లిని ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే దగ్గు, జలుబు వంటి వాటితో పాటు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ చలి కాలంలో మంచు విపరీతంగా ఉంటుంది.

ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరాలు వంటి సీజనల్ సమస్యలు చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా బలంగా ఉండాలంటే వెల్లుల్లి పాయ చాలా బాగా సహాయపడుతుంది.
Garlic Benefits in telugu
చలి కాలంలో తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వెల్లుల్లిలో విటమిన్స్, ఖనిజాలు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్త సరఫరా బాగా జరిగేలా చేసి రక్త పోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించి శ్వాస కోస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఆస్తమా ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది.
asthama
అయితే ప్రతి రోజు 2 వెల్లుల్లి రెబ్బలను ఎలా తీసుకోవాలో చూద్దాం. ఉదయం పరగడుపున తేనెలో వెల్లుల్లిపాయలను నానబెట్టి తీసుకోవచ్చు… లేదంటే కచ్చాపచ్చాగా దంచి పాలలో మరిగించి ఆ పాలను వడగట్టి తాగవచ్చు.. లేదంటే మధ్యాహ్నం వేడి.. వేడి అన్నంలో వెల్లుల్లి రెబ్బలను పెట్టుకొని తినవచ్చు. వెల్లుల్లిని ఇప్పుడు చెప్పిన విధానంలో ఏ రూపంలో తీసుకున్నా చలికాలంలో వచ్చే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.