అరస్పూన్ పొడి మజ్జిగలో కలిపి తాగితే ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి డయాబెటిస్ తగ్గుతుంది
kakarakaya podi for diabetes In Telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవటం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం, ఎక్కువ సేపు అలా కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలు చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి.
కాకర కాయను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు క్రమంగా మధుమేహాన్ని నిర్వహించడానికి సహజ సిద్దమైన ఆహారంగా భావించబడుతుంది. మనలో చాలా మంది కాకరకాయ తింటే డయాబెటిస్ తగ్గిపోతుందని భావిస్తారు. కానీ డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే తప్పనిసరిగా మందులు వాడవలసిందే.
మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. కాకరలో ఉండే ‘కరాటిన్’, ‘మమోర్డిసిన్’ అనే పోషకాలకు రక్తంలోని చక్కెర పాళ్లను కొంతవరకు తగ్గించే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే కాకర గింజలలో పాలీపెపై్టడ్–పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం కూడా ఉంటుంది. అది కూడా ఇన్సులిన్‌లాగా ప్రవర్తించి కొంతవరకు చక్కెరపాళ్లను అదుపు చేస్తుంది.
కాకరను జ్యూస్ చేసుకొని తాగవచ్చు. కాకరను కూరగా చేసుకోవచ్చు. కాకరను ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోని నిల్వ చేసుకొని వాడవచ్చు. ఒక గ్లాస్ మజ్జిగలో అరస్పూన్ పొడిని కలిపి తాగవచ్చు. కాకరకాయ పొడి మార్కెట్ లో కూడా లభ్యం అవుతుంది. కానీ ఇంటిలో చేసుకుంటేనే మంచిది.
డయాబెటిస్ నియంత్రణ ఉండటానికి సహాయపడటమే కాకుండా కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.