Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు ఈ ఆకును తింటే రక్తాన్ని పెంచటంతో పాటు… రక్తపోటును తగ్గిస్తుంది

Gongura Health Benefits In Telugu : ఈ చలికాలంలో ఆకుకూరలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. అలాగే అందరికీ అందుబాటు ధరలలో ఉంటాయి. ఆకుకూరలను వారంలో మూడు సార్లు తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. గోంగూరలో ఉన్న పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Gongura
గోంగూర అంటే తెలియని తెలుగు వారు ఉండరు. ఎందుకంటే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు గోంగూర తెలుగు వారి ఇష్టమైన ఆహారాలలో మొదటి వరుసలో ఉంటుంది. గోంగూర రుచి లోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వారంలో రెండుసార్లు గోంగూర తింటే రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకి చాలా సహాయపడుతుంది.
gongura benefits
మన శరీరానికి ఐరన్ చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంచటం నుంచి జీర్ణ వ్యవస్థ వరకు ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి సహాయ పడుతుంది. అలసట., నీరసం, నిసత్తువ వంటి వాటిని తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ రవాణా చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
ఐరన్ అనేది ఒక సూక్ష్మ పోషకం. ఇది కండరాలు., ఎముకలు, కణజాలం, మృదులాస్థి, చర్మం మరియు రక్తాన్ని నిర్మించడంలో సహాయ పడుతుంది. అటువంటి ఐరన్ అనేది గోంగూరలో చాలా సమృద్ధిగా ఉంటుంది. రక్తపోటు తగ్గించటానికి కూడా గోంగూర సహాయపడుతుంది. అధిక రక్తపోటు కారణంగా గుండెకు సంబంధించిన సమస్యలు అలాగే కిడ్నీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. గోంగూరలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన నరాల బలహీనత తగ్గుతుంది. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి కూడా తగ్గుతాయి. గోంగూర మనకు ఈ చలి కాలంలో చాలా చౌకగా దొరుకుతుంది. కాబట్టి ఈ గోంగూరను వారంలో రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే మంచిది. గోంగూర మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.