ఈ గింజల గురించి తెలుసా… ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు
Red chilli seeds Health benefits In Telugu : మనం సాధారణంగా మిరపకాయలలో ఉండే గింజలను పాడేస్తూ ఉంటాం. కానీ మిరప గింజలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి తెలియక మనలో చాలా మంది మిరప గింజలను పాడేస్తూ ఉంటారు. తలనొప్పి తగ్గటానికి మిరప గింజలు చాలా బాగా సహాయపడతాయి.
మిరప గింజలలో నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని నుదురు మీద రాయాలి. ఈ విధంగా చేయటం వలన తలనొప్పి తగ్గుతుంది. అలాగే కండరాల నొప్పులను,కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఏ నొప్పులను అయినా తగ్గించే శక్తి మిరప గింజలకు ఉంది. నొప్పి ఉన్న ప్రదేశంలో మిరప గింజల పేస్ట్ రాస్తే నొప్పులు తగ్గుతాయి.
మిరప గింజలు మరియు మిరియాలు రెండింటిని సమానంగా తీసుకోని నూనె లేదా నెయ్యిలో వేసి బాగా మాడ్చాలి. ఆ నూనెను వడకట్టి భద్రపరుచుకొని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
మిరప గింజలను మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో అరస్పూన్ మిరప గింజల పొడిని కలిపి త్రాగితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మిరప గింజలు బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడతాయి. మిరప గింజలలో ఉండే క్యాప్సైసిన్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయటం వలన కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. దాంతో బరువు తగ్గుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.