వారంలో 2 సార్లు తింటే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది…ప్రోటీన్ లోపం అనేది అసలు ఉండదు
Green Peas Benefits In telugu: ఈ సీజన్ లో పచ్చి బఠానీ కాయలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. వీటిని వారంలో రెండు సార్లు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మధ్య కాలంలో సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో ప్రోటీన్ లోపం అనేది కనపడుతుంది.
ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు ప్రోటీన్ సమృద్దిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాలలో బఠానీ ఒకటి. వీటిని పచ్చిగానూ, ఎండబెట్టి కూడా వాడవచ్చు. వీటిని ఉడికించి తినవచ్చు..లేదంటే కూరల్లో వేసుకొని తినవచ్చు. వీటిని ఎలా తీసుకున్న వాటిలో ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.
పచ్చి బఠానీ దొరికినప్పుడు వాటిని వాడుకోవచ్చు. అవి దొరకనప్పుడు ఎండు బఠానీని నానబెట్టి వాడుకోవచ్చు. అతి చవకగా ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారం. ప్రోటీన్ లోపం కారణంగా కండరాల బలం తగ్గుతుంది. అలాగే హార్మోన్స్ ఉత్పత్తి మీద ప్రభావం పడుతుంది. రక్షణ వ్యవస్థ బలహీనం అవుతుంది.
పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపుతుంది. ప్రోటీన్ లోపం కారణంగా ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. బఠానీలలో ప్రోటీన్ తో పాటు అన్నీ రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. రోజుకి ఒక స్పూన్ బఠానీలను తీసుకుంటే ప్రోటీన్ లోపం లేకుండా ఉంటుంది.
ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గాలని అనుకొనే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వీటిని తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా తొందరగా ఆకలి కూడా వేయదు. అలాగే ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్ సమృద్దిగా ఉండుట వలన అలసట,నీరసం వంటివి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు. వీటిలో అధిక శాతం ఫైబర్ కలిగి ఉండి మలబద్దకంతో పోరాడుతుంది మరియు జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. వేపిన బఠానీలు తింటే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.