MoviesTollywood news in telugu

Prema Kavali సినిమా వెనక నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Prema Kavali Movie Online : సినీ పరిశ్రమలో వారసులు రావటం సాదరణమే. కొంత మంది సక్సెస్ అవుతారు.. మరి కొంత మంది సక్సెస్ అవ్వటం కష్టం అవుతుంది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసిన సాయికుమార్ తన కొడుకు ఆదిని హీరోగా ఎంట్రీ ఇప్పించడానికి చాలా శ్రమించారు. పెద్ద కసరత్తు చేసారు.

నిర్మాత అచ్చిరెడ్డిని అడగడం, ఆయన ఒకే చెప్పడం, ఇక పెద్ద స్టార్ట్ తో డైరెక్ట్ చేసిన కె విజయ భాస్కర్ దర్శకునిగా ఫిక్స్ కావడం చకచకా సాగాయి. కథ కోసం కూడా పెద్ద కసరత్తు చేసారు. అలా అది హీరోగా ప్రేమ కావాలి మూవీ స్టార్ట్ అయింది. హీరోయిన్ గా ఢిల్లీకి చెందిన ఇషా చావ్లా ను సెలెక్ట్ చేసారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా సెలెక్ట్.

మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసారు. మొదటి సినిమా ఇంతటి భారీ ఎత్తున స్టార్ట్ చేయడంతో ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తేనే నిలబడతావు లేదంటే కష్టమే అని సాయికుమార్ చెప్పడంతో ఆది చాలా కష్టపడి నటించాడు. సాంగ్స్ కోసం లొకేషన్స్ చోటా కె నాయుడు చెప్పిన ప్రకారం చేయడంతో బడ్జెట్ ఎక్కువే అయింది.

అయినా అచ్చిరెడ్డి ఎక్కడా రాజీ పడలేదు. తాను ప్రేమించిన అమ్మాయిని లైన్ లోకి తీసుకు రావడానికి ఆది వేసే ట్రిక్స్ కొత్తగా ఉంటాయి. ఈ మూవీలో కామెడీ ఎంటర్ టైనర్ తో ఈ లవ్ ట్రాక్ చాలా బాగానే వచ్చింది. హీరోయిన్ ని హీరో ముద్దు పెట్టుకోవడం, అది కాస్తా విలన్ ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది.

అప్పటి నుంచి హీరోని దూరంగా ఉంచుతుంది. అయితే చివరకు ఆమెను ఎలా పొందగలిగాడనే ఆసక్తికర పాయింట్ తో సినిమా నడుస్తుంది. సినిమాకు ఏవరేజ్ టాక్ రావడం, నాని అలా మొదలైంది సూపర్ హిట్ తో దూసుకుపోవడం నేపథ్యంలో ప్రమోషన్ వర్క్ అచ్చిరెడ్డి పెంచడంతో జనాల్లో ఈ సినిమా ఒకేసారి చూడాలన్న ఆసక్తి ఏర్పడేలా చేసింది.

ఆ విధంగా చాలా బాగుంది అనే టాక్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. అచ్చిరెడ్డి ఇచ్చిన పబ్లిసిటీ బాగా వర్కవుట్ అయింది. కలెక్షన్స్ పెంచింది.2011 ఫిబ్రవరి 25న వచ్చిన ఈ మూవీ 75సెంటర్స్ లో 50రోజులు, 23సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 100 డేస్ వేడుకకు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఎన్నో అవార్డులు కూడా ఆది అందుకున్నాడు.