Swathi Muthyam చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా ?
Swathi muthyam child artist karthik :సినిమాల్లో నటించే చైల్డ్ ఆర్టిస్ట్స్ లలో కొంత మంది మంచి పేరును తెచ్చుకుంటారు. చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో రాణించి పెద్దయ్యాక హీరో హీరోయిన్స్ గా కూడా సత్తా చాటిన వాళ్లు చాలామంది ఉన్నారు. అందులో శ్రీదేవి మొదలుకుని రోజా రమణి , మీనా, రాశి, తరుణ్ ,మహేష్ బాబు, బాలాదిత్య, ఇలా చాలామంది బాలనటులుగా వచ్చి తర్వాత హీరో, హీరోయిన్స్ గా అవతరమెత్తి కొందరు ఇండస్ట్రీలో తమ టాలెంట్ తో దూసుకుపోతుంటే, కొందరు వివిధ కారణాల వలన ఇండస్ట్రీకి దూరంగా జరుగుతున్నారు.
ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా ఒకటి రెండు సినిమాల్లో నటించి తమ నటనతో చెరగని ముద్రవేసిన వాళ్ళు పెద్దయ్యాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అందులో ముఖ్యంగా స్వాతి ముత్యంలో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన కార్తీక్ గుర్తున్నాడా? బహుముఖ పాత్రలతో మెప్పిస్తున్న కమల్ హాసన్ హీరోగా రాధిక హీరోయిన్ గా కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఈ సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులే కాదు, స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి సినిమా చేసే ఛాన్స్ తనకు ఇవ్వాలని ఏరికోరి స్వయంకృషి మూవీ చేసాడు. అంతలా విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ సినిమా స్వాతిముత్యం జన హృదయాల్లో నిలిచింది. ఒక క్యారెక్టర్ ని రాసుకుని ఆ క్యారెక్టర్ ని కమల్ హాసన్ అయితే బాగా చేయగలడని అనుకొని అతడి చేత చేయించి, అతడిలోని నటన ప్రతిభను బయట తీసిన ఘనత మాత్రం విశ్వనాధ్ కే దక్కుతుందని చెప్పకతప్పదు.
సాగర సంగమం తర్వాత స్వాతిముత్యం ఆ తర్వాత శుభ సంకల్పం మూవీస్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి హిట్ అందుకున్నాయి. ఈ మూవీలో కమల్ తో పోటీపడి నటించి, తన చిట్టి పొట్టి మాటలతో ఆడియన్స్ మన్ననలు పొందిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తీక్ ఎవరంటే, ఒకప్పుడు జానపద చిత్రాల హీరోల హీరోగా ఓ వెలుగు వెలిగిన నటుడు కాంతారావు కి స్వయానా మనవడు.
తన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒకరు ఉండాలనే ఉద్దేశంతో తన మనవడితో స్వాతిముత్యం మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేయించాడు. అయితే ఆ తర్వాత కార్తీక్ సినిమాల్లో కన్పించలేదు. అమెరికాలో స్టడీస్ అయ్యాక ఇటీవల ఇండియాకి వచ్చి రమ్య అనే అమ్మాయిని పెళ్ళాడి, బిజినెస్ రంగంలో రాణిస్తూ ఇండియాలో సెటిలయ్యాడు.