Bommarillu సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో…?
Bommarillu Full Movie : బొమ్మరిల్లు సినిమా ఎంతటి ఘన విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో సిద్ధార్ధ,జెనీలియా జంటగా నటించిన బొమ్మరిల్లు సినిమా కథను మొదట జూనియర్ ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ లను హీరోలుగా పెట్టాలని చూస్తే ఇద్దరూ ఒప్పుకోకపోవడంతో సిద్దార్ధ ను ఎప్రోచ్ కావడం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా సాగాయి.
హీరోయిన్ గా సింధు తులాని పేరు దిల్ రాజు ప్రపోజ్ చేయగా, హ్యాపీ మూవీ సమయంలో చూసిన జెనీలియా కళ్ళు బాగుంటాయని ఆమె తన హీరోయిన్ అని భాస్కర్ చెప్పేసాడు. జయసుధని కూడా ఒప్పించాడు.
వైవిఎస్ చౌదరి అదే సమయంలో బొమ్మరిల్లు బ్యానర్ ఓపెన్ చేయడం,దాని ఇన్విటేషన్ దిల్ రాజు ఆఫీసులో కనిపించడంతో అదే టైటిల్ అయింది. 8కోట్ల బడ్జెట్ తో 120రోజుల షూటింగ్ ప్లాన్ చేస్తే,105రోజుల్లోనే పూర్తిచేసాడు. 25కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది.