డయాబెటిస్ ఉన్నవారు ఈ గింజలను తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా ?
Jamun Seeds benefits In telugu :నేరేడు పండ్లలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మన అందరికి తెలిసిందే. అయితే నేరేడు గింజలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది.
నేరేడు పండ్లను తిని గింజలను పాడేస్తూ ఉంటారు. అయితే ఆ గింజలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి వరం అని చెప్పవచ్చు. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాక ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే అల్సర్ సమస్య ఉన్నవారు ఈ పొడిని మజ్జిగలో కలిపి తాగితే అల్సర్ సమస్య తగ్గటమే కాకుండా జీర్ణ సమస్యలు ఉండవు. శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.
నేరేడు సాధారణంగా వగరుగా, పుల్లగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలను తినలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నేరేడు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకొని అన్నంలో కలుపుకోవచ్చు. నీటిలో లేదా మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు. నేరేడు గింజల పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఆయుర్వేదంలో ఈ పొడిని ఎక్కువగా వాడతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.