శనగపిండితో ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Besan Hair Fall Tips In telugu: జుట్టుకి సంబందించిన సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. జుట్టు రాలిపోవటం,చుండ్రు సమస్య వంటి వాటిని మనలో చాలా మంది ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. పెరుగు,శనగపిండి… ఈ రెండు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.
ఒక కప్పు పెరుగులో మూడు స్పూన్ల శనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి…అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు రాలకుండా ఉండటమే కాకుండా చుండ్రు కూడా తగ్గుతుంది.
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా స్కాల్ప్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పెరుగులో మంచి మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇచ్చి జుట్టు రాలకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
శనగపిండిలో ఉండే ముఖ్యమైన పదార్థాలు జుట్టు మూలాల్లోకి వెళ్లి మురికిని పూర్తిగా శుభ్రం చేస్తాయి. ఇలా చేయడం వల్ల జుట్టు మళ్లీ మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. చుండ్రును తొలగించి జుట్టు రాలకుండా పొడవుగా పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ ట్రై చేసి జుట్టు సమస్యల నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.