Healthhealth tips in teluguKitchen

ఈ నీటిని తాగితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాన పొట్ట ప్లాట్ గా మారుతుంది

Cumin seeds Weight Loss Benefits in telugu : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, అధిక బరువు సమస్య కారణంగా డయాబెటిస్, గుండె సమస్యలు, రక్తపోటు వంటివి వచ్చేస్తాయి.
cumin seeds
ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బరువు తగ్గాలి. జీలకర్ర బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టి అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం నానిన జీలకర్రను నీటితో సహా ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
lemon benefits
మరిగిన ఈ నీటిని వడగట్టి అరచెక్క నిమ్మరసం కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగితే 15 రోజుల్లోనే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. జీలకర్రలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని అధిక కొవ్వుని తగ్గిస్తాయి.
Weight Loss tips in telugu
ఈ నీరు తాగడంవల్ల జీర్ణ సమస్యలు దూరమై జీర్ణాశయం శుభ్రం అవుతుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. అంతేకాక బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా జీలకర్రలో ఉండే కాల్షియం సహాయపడుతుంది. అలాగే కిడ్నీలో మలినలను తొలగించి కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది.
Acidity home remedies
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, సిట్రిక్‌ యాసిడ్ అనేవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి అధిక బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీలకర్ర,నిమ్మకాయ నీటిని ప్రతి రోజు తాగితే చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. అంతేకాక డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.