1 గ్లాస్ తాగితే చాలు రోగనిరోధక శక్తిని పెంచి డయాబెటిస్,రక్తపోటు నియంత్రణలో ఉంటాయి

Godhuma Gaddi : గోధుమ గడ్డిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోధుమ గడ్డిలో ఐర‌న్‌, కాల్షియం, ఎంజైమ్‌లు, మెగ్నిషియం, ఫైటో న్యూట్రియెంట్లు, 17 ర‌కాల అమైనో యాసిడ్లు, విట‌మిన్‌లు ఎ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్‌, క్లోరోఫిల్‌, ప్రోటీన్లు సమృద్దిగా ఉండుట వలన సూపర్ ఫుడ్ గా పిలుస్తారు.
wheat grass benefits
గోధుమ గడ్డి జ్యూస్ తాగితే శరీరంలో విషపదార్థాలను బయటికి పంపి శరీరం అంతర్గతంగా శుభ్రంగా అవుతుంది. గోధుమ గడ్డిలో ఉండే ఎంజైమ్స్ మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం అవటానికి సహాయపడతాయి. దాంతో గ్యాస్., కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావు. జీర్ణక్రియ బాగా పెరగడం వల్ల క్యాలరీలు వేగంగా ఖర్చు అయి బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
cholesterol
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే రక్తపోటు, డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.
Brain Foods
గోధుమ గడ్డి జ్యూస్ ని రోజుకి 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవచ్చు. పొడి అయితే ఒక టీస్పూన్ పొడిని 250 ఎంఎల్ నీటిలో క‌లిపి తీసుకుంటే మంచిది. యితే గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు గోధుమ గ‌డ్డి జ్యూస్‌ను తీసుకోకూడదు. ఇక దీన్ని తీసుకున్నాకఈ జ్యూస్ తీసుకున్నాక వికారం, త‌ల‌నొప్పి, మ‌ల‌బ‌ద్ద‌కం, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తే ఈ జ్యూస్‌ను తీసుకోవ‌డం వెంటనే ఆపేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.