ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సూప్ ఇలా 10 నిమిషాల్లో చేసుకోని వేడివేడిగా తాగితే ఎన్నో ప్రయోజనాలు

Ragi Soup benefits in Telugu : చల్లని వాతావరణంలో వేడివేడిగా రాగి సూప్ చేసుకొని తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఎంతో రుచికరంగా ఉండే ఈ సూప్ ని పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు. ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. 5 బీన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Is Ragi Good for Diabetes
ఒక క్యారెట్ తీసుకొని చెక్కులు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అర అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. రెండు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ జీలకర్ర, అల్లం,వెల్లుల్లి ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు,బీన్స్ ముక్కలు,క్యారెట్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగించాలి.

ఆ తర్వాత 3 కప్పుల నీటిని, సరిపడా ఉప్పు వేసి మరిగించాలి. ఒక కప్పులో 3 స్పూన్ల రాగి పిండిని తీసుకొని నీటిని పోసి బాగా కలపాలి. ఈ రాగి పిండి మిశ్రమాన్ని మరిగిన నీటిలో వేసి బాగా కలపాలి. మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత పావు స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
Onion benefits in telugu
రెండు నిమిషాలు అయ్యాక కొంచెం కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేసి దించాలి. వేడివేడిగా ఈ సూప్ తాగితే ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సూప్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.