ఈ జ్యూస్ తాగితే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

Pineapple and keera juice benefits : వేసవి కాలంలో అలసట,నీరసం లేకుండా ఉండాలంటే కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే మంచిది. మనం ఇంటిలోనే మంచి పోషకాలు ఉన్న డ్రింక్స్ తయారుచేసుకోవచ్చు. ఫైనాఫిల్,కీరా,యాపిల్ తో డ్రింక్ తయారుచేసుకుంటున్నాం. ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు ఫైనాఫిల్ ముక్కలు,ఒక కప్పు కీరా ముక్కలు,అరకప్పు యాపిల్ ముక్కలు వేయాలి.

ఆ తర్వాత ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. ఈ జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి వడకట్టాలి. ఈ జ్యూస్ లో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. చల్లదనం కోసం ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. ఈ జ్యూస్ ని వారంలో రెండు సార్లు తాగవచ్చు. ఈ జ్యూస్ లో antihypertensive సామర్ధ్యం ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
pineapple benefits
పైనాపిల్, కీరా ముక్కల్లో విటమిన్‌ సి, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు చర్మం పొడిగా మారకుండా కాపాడతాయి. విటమిన్‌ సి ప్రోటిన్‌తో కలిసి ముఖం మీద ముడతలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెబేసియస్‌ గ్రంథుల పనితీరు మెరుగుపడి, చర్మం తేమగా ఉంటుంది.వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు తగ్గుతాయి.
lemon benefits
ఈ జ్యూస్‌లో బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది యాంటీఇన్‌ఫ్లమేటరి విధులను నిర్వహిస్తుంది. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. తరచూ ఈ డ్రింక్‌ తాగడం వల్ల క్యాన్సర్‌ ముప్పు కూడా తగ్గుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియంలు ఉండడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.