వేసవిలో ఈ 3 డ్రైఫ్రూట్స్ ఇలా తింటే.వేడి,అలసట,నీరసం,నిస్సత్తువ తగ్గి హుషారుగా ఉంటారు

Dry Fruits : ఎండాకాలం వచ్చేసింది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండలోకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అలసట,నీరసం వంటివి వచ్చేస్తాయి. అలా కాకుండా ఉషారుగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే డ్రై ఫ్రూట్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. బాదం పప్పును నానబెట్టి తినాలి. రాత్రి సమయంలో 4 బాదం పప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానబెట్టిన బాదం పప్పును తొక్క తీసి తినాలి.
Fig Fruit Benefits in telugu
నల్ల ద్రాక్ష కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రాత్రి సమయంలో 4 ఎండు నల్ల ద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన ద్రాక్షను ఆ నీటిని తాగాలి. వీటిని నానబెట్టకుండా తింటే వేడి చేస్తుంది. నానబెట్టటం వలన వేడి తగ్గుతుంది. అంజీర్ కూడా ఈ వేసవిలో నీరసం,నిస్సత్తువ తగ్గించటంలో సహాయపడుతుంది.
Diabetes patients eat almonds In Telugu
అంజీర్ ని కూడా రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. ఈ మూడింటిని నానబెట్టి తినాలి. ఉదయం సమయంలో తింటే శరీరంలో వేడి తగ్గి నీరసం,నిస్సత్తువ తగ్గి చురుకుగా ఉంటారు. వీటిని ఇలా తినటం ఇబ్బందిగా ఉన్నవారు వీటిని మిక్సీ చేసి పాలల్లో కలిపి కూడా తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.