మీ కంటి చూపు ఎంతలా పెరుగుతుందంటే 7 రోజుల్లో కళ్ళజోడు విసిరేస్తారు…జీవితంలో కళ్ళజోడు అవసరం ఉండదు
Eye sight increase remedy : ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కంటికి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. కంటి చూపు మెరుగుపడటానికి కంటికి సంబందించిన సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే ఆయుర్వేద చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
నానిన ఎర్రకందిపప్పును డ్రై రోస్ట్ చేసి ఉడికించాలి. ఉడికిన ఎర్రకందిపప్పులో నాలుగు మిరియాలను,ఉప్పు వేసి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ అవునెయ్యి వేసి బాగా కలిపి తినాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు తీసుకుంటే కంటికి సంబందించిన సమస్యలు తగ్గటమే కాకుండా కంటి శుక్లం, కండరాల క్షీణత తగ్గుతాయి.
ఎర్రకందిపప్పులో విటమిన్ A,C,E సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు కంటి సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్దిగా ఉండుట వలన కంటికి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మిరియాలలో యాంటీ ఇన్ ఫ్లెమేటరీ లక్షణాలు ఉండుట వలన కంటి వాపును తగ్గించటంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.