ఇలా చేస్తే పాదాలలో ఆనెలు ఒక్క రోజులోనే తగ్గిపోతాయి…మళ్ళీ రావు

Foot Corn Home Remedies in Telugu : మనలో చాలా మందిని పాదాలపై ఆనెలు వేధిస్తూ ఉంటాయి. మృతకణాలు పేరుకుపోవటం, బ్యాక్టీరియా, అధిక రాపిడి వంటి కారణాల వల్ల పాదాలపై ఆనెలు వస్తూ ఉంటాయి. ఆనెలు వచ్చినప్పుడు బాధను కలిగించడమే కాకుండా నడిచే సమయంలో చాలా అసౌకర్యం కలిగిస్తాయి. కొద్దిగా దూరం నడిచినా కూడా నొప్పి వస్తుంది.
Garlic side effects in telugu
అందుకే వీటిని తగ్గించుకోవడానికి రకరకాల అయింట్ మెంట్స్, క్రీమ్స్ వాడుతుంటారు. వీటిని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయ పడుతాయి. అనెలను తగ్గించుకోవటానికి వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు అనెలను తగ్గించడానికి సహాయపడుతాయి.
Eating raw onion with meals health benefits telugu
వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని. అనెలు ఉన్న ప్రదేశంలో కట్టు కట్టాలి.ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. బకెట్ లో గోరువెచ్చని నీటిని పోసి ఉల్లిపాయ రసం వేసి అందులో పాదాలను ఉంచాలి ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే తగ్గుముఖం పడతాయి.
Foor Corn Home remedies
సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఈ ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇటువంటి ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త ఓపికగా,శ్రద్దగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.