Allari Priyudu సినిమా వెనక నమ్మలేని నిజాలు… ఎన్ని కోట్ల లాభమో…?
Rajasekhar Allari Priyudu Movie:టాలీవుడ్ లో అప్పటివరకూ యాంగ్రీ మాన్ గా పవర్ ఫుల్ రోల్స్ తో ఆడియన్స్ తో కనెక్ట్ అయిన డాక్టర్ రాజశేఖర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే మూవీతో అతడి కెరీర్ కొత్తమలుపు తిరిగింది. తలంబ్రాలు,అంకుశం వంటి మూవీస్ తో అతడి నటన చూసిన వాళ్ళు క్లాసిక్ పాత్రకు ఎలా పనికొస్తాడని అనుకోవడం సహజం.
అందుకు భిన్నంగా చేయాలంటే రిస్క్ ఉంటుందని తెల్సిందే. ఎందుకంటే ఒకవేళ తేడా కొడితే మొత్తం కెరీర్ దెబ్బతినేస్తుంది. కానీ, ఏదయినా చేయగలనని చేసి చూపించాడు.నిజానికి చెన్నపట్నం చిన్నోళ్లు,యమపాశం,శిలాశాసనం,మంచివారు మావారు, మొరటోడు నా మొగుడు లాంటివన్నీ చేసినా కూడా రాజశేఖర్ కి సూపర్ హిట్స్ ఇవ్వలేదు.
అక్కమొగుడు కొంత సెంటిమెంట్ పండినా, మగాడు మూవీ అంకుశం రేంజ్ లో హిట్ కాకపోవడం లాంటి సమయంలో రాజశేఖర్ కెరీర్ ఇబ్బందులో పడేలా యింది. సరిగ్గా ఆలాంటి సమయంలో 1993లో వచ్చిందే అల్లరి ప్రియుడు మూవీ. ఇప్పటికీ ఇందులోని పాటలు వినసొంపుగానే ఉంటాయి. యాంగ్రీ యంగ్ మాన్ ని లవర్ బాయ్ గా మార్చేసిన ఘనత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కే దక్కుతుంది.
హిందీలో సూపర్ హిట్ అయిన సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ల మూవీ సాజన్ లోని పాయింట్ ని అటూ ఇటూ మార్పు చేసి, కొత్త ట్రీట్ మెంట్ తో రాఘవేంద్రరావు ఈ మూవీ తీశారు. రమ్యకృష్ణ , మధుబాల గ్లామర్, కీరవాణి మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయింది మొదట్లో అందరూ టైటిల్ చూసి ఇదేంటి ఇలాంటి సినిమా ఎలా సూటవుతుందని రాజశేఖర్ కి అని అందరూ అనుకున్నారు. కానీ రాఘవేంద్రరావు మార్క్ చూపించడంతో ఈ మూవీ వందరోజులు ఆడింది.లాభం కూడా గట్టిగానే వచ్చింది.