నెలకు ఒక్కసారైనా వేప పుల్లతో పళ్లు తోమాలి.. కారణం ఏమిటో తెలుసా?
Neem Sticks Health Benefits In telugu :వేప పుల్లతో పళ్లు తోమటమా అది కుదిరే పని కాదులే అనుకుంటున్నారా? అయితే ఇది మీరు తెలుసుకుని తీరాల్సిన విషయం. రోజు కాక పోయినా నెలకు ఒకసారి అయినా వేప పుల్లతో పళ్లు తోముకుంటే మంచిదని వైధ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేపలో సూక్ష్మ జీవులను నివారించే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు సమృద్దిగా ఉన్నాయి.
వేప పుల్లతో పళ్లు తోముకుంటే నోట్లో ఉన్న క్రిములు నిర్మూలించబడతాయి. దంతాలను దృఢంగా మార్చే శక్తి వేప పుల్లకు ఉంది. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. వేప పుల్లను నమిలేప్పుడు దాంట్లోంచి నోట్లోకి వచ్చే ద్రవాలు దంత క్షయాన్ని నివారిస్తాయి. భవిష్యత్తులో కూడా దంత క్షయం రాదు. నోటిలో బాక్టీరియా ఎక్కువగా ఉంటే దుర్వాసన వస్తుంది.
దీన్ని నివారించడంలోనూ వేప అద్భుతంగా పనిచేస్తుంది. తరచూ వేప పుల్లతో పళ్లు తోముకుంటే నోటి దుర్వాసన అసలు రాదు. వెనుకటి కాలంలో అందరూ వేప పుల్లతోనే పళ్లు తోముకునే వారు. పల్లెలో అయితే ఇప్పటికీ వేప పుల్లనే వాడుతుండటం మనకు తెలుసు. పట్టణాల్లో వేప చెట్లు ఉన్నా.. వాటి వద్దకు వెళ్లి తెచ్చుకుని పళ్లు తోముకునేంత ఓపిక ఇప్పటి జనాలకు లేదు.
కొన్ని సార్లు వేప పుల్లపై పేస్ట్ వేసుకని తోముకునే ఉత్తములు ఉన్నారు. కొద్దిగైనా మారాలంటున్నారు దంత నిపుణులు. లేకపోతే దంతాలు పాడవుతాయని హెచ్చరిస్తున్నారు. నెలకు ఒకసారైనా ప్రయత్నం చేద్దాం.. పోయేదేముంది. దంతాలు మరింత కాలం మన్నికగా ఉండటం తప్ప..
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.